SACRED “PAVITRA SAMARPANA” PERFORMED AT TALLAPAKA SRI CHENNAKESAVA SWAMY TEMPLE _ తాళ్లపాక శ్రీ చెన్న కేశవస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirupati / Tallapaka, 29 August 2025: The sacred Pavitra Samarpana was performed with religious fervour at Sri Chennakesava Swamy Temple, Tallapaka, on Friday.
As a part of it sacred garlands were offered in the Yagashala and then ceremoniously taken in a procession to the sanctum.
In the evening, Vedic programmes were held in the Yagashala.
Temple Deputy EO Smt. Prasanthi, Superintendent Sri Hanumanthayya, Temple Inspectors Sri Balaji, temple priests, and a large number of devotees participated in this sacred event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి / తాళ్ళపాక, 2025 ఆగష్టు 29: తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగశాలలో పుణ్యాహవచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జరిగాయి.
అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూలవర్తకు, ఉత్సవర్లకు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్, బలిపీఠం ధ్వజస్తంభం, పరివార దేవతలకు పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ బాలాజి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబందాల అధికారిచే విడుదల చేయబడినది.



