PAVITHROTSAVAMS AT SRI SIDDHESWARA SWAMY TEMPLE CONCLUDES _ తాళ్ళ‌పాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆల‌యంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Tallapaka/Tirupati, 16 August 2025: The three-day annual Pavithrotsavams at Sri Siddheswara Swamy temple in Tallapaka, Annamayya district, concluded on Saturday  with the grand Maha Poornahuti.

As part of the concluding rituals, special programmes were conducted in the Yagashala of Sri Siddheswara Swamy along with Sri Kamakshi Devi including Nitya Homam, Pavitra Puja, Pavitra Samarpana to the Parivara Devatas, followed by the Maha Poornahuti.

The Temple staff and a large number of devotees participated in these holy events.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తాళ్ళ‌పాక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆల‌యంలో ముగిసిన పవిత్రోత్సవాలు 

తిరుపతి / తాళ్ళ‌పాక‌, 2025 ఆగస్టు 15: అన్నమయ్య జిల్లా తాళ్ళ‌పాక‌లోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయాల‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న పవిత్ర ఉత్సవాలు శనివారం ఉదయం మహా పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి

ఇందులో భాగంగా ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారికి యాగశాలలో వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో నిత్య హోమం, పవిత్ర పూజ, పరివార దేవతలకు పవిత్ర సమర్పణ, మహా పూర్ణాహుతి జరిగింది.   

సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు.    

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది