‘తితిదేలో వర్గ బదిలీలు’ అను వార్త వాస్తవం కాదు

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ(తిరుపతి, నవంబర్‌-20,2009)

‘తితిదేలో వర్గ బదిలీలు’ అను వార్త వాస్తవం కాదు

నవంబర్‌ 20వ తేదిన ఈనాడు దినపత్రిక నందు ప్రచురించిన ‘తితిదేలో వర్గ బదిలీలు’ అను వార్త వాస్తవం కాదు.

తితిదేలో పనిచేసే కేవలం 44 మంది పర్యవేక్షకులకు మాత్రమే 19వ తేదినాడు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఈబదిలీల ప్రక్రియ ఎటువంటి వర్గానికి ప్రాధాన్యత కనపరచలేదని మరియు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లోబడి జరగలేదని తెలియజేయు చున్నాము. తి.తి.దేవస్థానమునందు రూపొందించబడిన బదిలీ విధానం (ట్రాన్స్‌ఫర్‌ పాలసీ) ను అనుసరించి పారదర్శకతతో బదిలీ కార్యక్రమములు జరిగినది. తి.తి.దేవస్థానములో వున్న ప్రాధాన్యత (ఫోకల్‌) పదవులలో దీర్ఘకాలంగా పనిచేయుచున్న సిబ్బందిని బదిలీచేయడం జరిగింది. అంతేగానీ సదరు దినపత్రికలో ప్రచురించినట్లుగా బదిలీలలో ఏవర్గానికి ప్రాధాన్యత కల్పించలేదు. అంతేగాక ఎటువంటి ఒత్తిళ్ళులేవని తెలియజేస్తున్నాం. కావున సదరు పత్రికకు సంబంధించిన విలేకరి తి.తి.దేవస్థానముల అధికారులను సంప్రదించి వార్తలు ప్రచురిస్తే బావ్యంగా వుంటుంది. మరియు తి.తి.దేవస్థానముల సంబంధించిన వార్తలను ప్రచురించుటకు పూర్వము ఆయా శాఖల ఉన్నతాధికారులను సంప్రదించి వాస్తవ విషయాలను గ్రహించి ప్రచురించ వలసినదిగా కోరడమైనది.

కనుక రేపటి మీ దినపత్రిక నందు ఈ విషయాన్ని వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు