తితిదే డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

తితిదే డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, మే 09, 2013: తితిదే పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2013-14వ విద్యాసంవత్సరానికి గాను ప్రవేశానికి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాల(బాలబాలికలు), శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాల(బాలబాలికలు), శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల(బాలికలు) ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ మూడు కళాశాలల్లో కామన్‌ అడ్మిషన్లు ఇవ్వనున్నారు.

”కార్యనిర్వహణాధికారి, తితిదే, తిరుపతి” పేరిట రూ.25/-లకు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ లేదా పోస్టల్‌ ఆర్డరు తీసి కళాశాలలో దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి వివరాలకు తితిదే వెబ్‌సైట్‌ ను చూడొచ్చు. దరఖాస్తులను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తులతో పాటు రూ.25/- మొత్తం డి.డి తీసి సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించేందుకు మే 31 చివరి తేదీగా నిర్ణయించారు. ఇతర వివరాల కోసం ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264602 నంబరులో సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్‌  తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.