VIP DARSHAN TO RESUME IN PAT _ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జ‌న‌వ‌రి 6 నుండి బ్రేక్‌ దర్శనం పునఃప్రారంభం

Tirupati, 5 Jan. 21: The VIP break darshan wi resume in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor from Wednesday onwards.

TTD has stalled VIP break darshan in the temple owing to Covid pandemic in March. Though the darshan was resumed from June onwards, the VIP break darshan has not commenced.

From January 6 onwards the VIP break darshan will be implemented between 11:30am and 12 noon and again 7pm and 7:30pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జ‌న‌వ‌రి 6 నుండి బ్రేక్‌ దర్శనం పునఃప్రారంభం

తిరుప‌తి‌, 2021 జ‌న‌వ‌రి 05: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జ‌న‌వ‌రి 6వ తేదీ బుధ‌వారం నుండి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం పునఃప్రారంభం కానుంది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఆల‌యంలో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విష‌యం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుసరించి జూన్ 8 నుండి ఆల‌యంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులను అనుమ‌తిస్తున్నారు.

ఈ క్ర‌మంలో భ‌క్తుల సౌక‌ర్యార్థం ఉదయం 11.30 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 7.30 గంటల వరకు విఐపి బ్రేక్‌ దర్శనాన్ని టిటిడి తిరిగి అమలుచేయనుంది. ప్రోటోకాల్‌ విఐపిలకు నిర్దేశించిన సమయంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు, సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్‌ దర్శనాన్ని టిటిడి తిరిగి ప్రారంభించింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.