తిరుచానూరులో బంగారు గొడుగు ఉత్సవం
తిరుచానూరులో బంగారు గొడుగు ఉత్సవం
తిరుపతి, 2022 నవంబరు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం బంగారు గొడుగు ఉత్సవం జరిగింది. పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన శ్రీ రామనాథన్ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది ఈ బంగారు గొడుగును రథానికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ గొడుగును ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి రథానికి అమర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 7.10 గంటలకు అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది.
పంతులుగారి వంశీయుల ఆధ్వర్యంలో తిరుమలతోపాటు తిరుచానూరు, తిరుపతిలోని
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ముందురోజున బంగారు గొడుగు ఉత్సవం నిర్వహిస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.