SILVER COIN NECKLACE DONATED TO SRI SRINIVASA TEMPLE AT TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీనివాస ఆలయానికి వెండి కాసుల హారం విరాళం
Tirupati, 15 December 2025: A silver coin necklace was donated to Sri Srinivasa Temple, Tiruchanoor, which is under the management of TTD, by Tirupati-based donors Smt. N. Nithyashree and her spouse on Monday.
The silver coin necklace, crafted with 24 silver coins was handedover to the AE0 of Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, Sri Devarajulu.
Temple priests and others were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుచానూరు శ్రీనివాస ఆలయానికి వెండి కాసుల హారం విరాళం
తిరుచానూరు, 2025, డిసెంబర్ 15: తిరుచానూరులో టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుపతికి చెందిన శ్రీమతి ఎన్. నిత్యశ్రీ దంపతులు సోమవారం ఉదయం స్వామివారికి 24 వెండి కాసుల హారంను బహుకరించారు.
ఈ సందర్భంగా 24 వెండి కాసులతో తయారు చేసిన గండ పేరుండంతో పొదిగిన వెండి కాసుల హారాన్ని దాత శ్రీమతి ఎన్ నిత్యశ్రీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్, శ్రీ శ్రీహరి, సీనియర్ అసిస్టెంట్ శ్రీ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీహరి, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది


