KAT PERFORMED FOR SRI PAT BTU _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tiruchanoor, 19 Nov. 19: The holy ritual of Koil Alwar Thirumanjanam was performed at the Sri Padmavathi Ammavari Temple on Tuesday morning as part of the ensuing Kartheeka Annual Brahmotsavams beginning on November 23.

The temple was cleaned with traditional herbs, detergents and perfumed waters since early hours and public darshan commenced later.

Temple DyEO Smt Jhansi Rani, VSO Sri Prabhakar, AEO SriSubramanyam, Superintendent Sri Madhusudhan, AvSO Sri Nandeeswara Rao, Arjita inspector Sri Kola Srinivasulu, Temple archakas Sri Pratap, Sri Manikantaswamy and other officials participated.

Details of Vahana sevas of Brahmotsavams.

23-11-2019, Dwajarohanam, Chinna Sesha Vahanam

24-11-2019 Pedda Sesha Hamsa Vahanam

25-11-2019 Muthyapu Pandiri and Simha vahanam

26-11-2019 Kalpavruksha and Hanumanta vahanam

27-11-2019 Pallaki utsava and Gaja vahanam

28-11-2019 Sarvabhoopala, Swarna ratham and Garuda vahanam 

29-11-2019 Suryaprabha and Chandraprabha vahanam

30-11-2019 Rathitsavam and Aswa Vahanam

01-12-2019 Panchami theertham and Dwajavarohanam

02-12-2019 Pushpa Yagam

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019 నవంబరు 19: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా జ‌రిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ధుసూద‌న్‌, ఎవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కోలా శ్రీ‌నివాసులు, ఆలయ ఆర్చకులు శ్రీ ప్ర‌తాప్‌, శ్రీ మ‌ణికంఠ‌స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                     ఉదయం                                       రాత్రి

23-11-2019(శనివారం)      ధ్వజారోహణం                           చిన్నశేషవాహనం

24-11-2019(ఆదివారం)   పెద్దశేషవాహనం                       హంసవాహనం

25-11-2019(సోమవారం)   ముత్యపుపందిరి వాహనం              సింహవాహనం

26-11-2019(మంగళవారం)  కల్పవృక్ష వాహనం                     హనుమంతవాహనం

27-11-2019(బుధవారం)   పల్లకీ ఉత్సవం                                    గజవాహనం

28-11-2019(గురువారం)    సర్వభూపాలవాహనం       స్వర్ణరథం, గరుడవాహనం

29-11-2019(శుక్రవారం)    సూర్యప్రభ వాహనం                    చంద్రప్రభ వాహనం

30-11-2019(శనివారం)        రథోత్సవం                                   అశ్వ వాహనం

01-12-2019(ఆదివారం)     పంచమితీర్థం                                   ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.