TTD EO INSPECTS BRAHMOTSAVAM ARRANGEMENTS _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు
Tirupati, 23 November 2024: As the annual Brahmotsavam at Tiruchanoor is scheduled from November 28 to December 06, TTD EO Sri J Syamala Rao along with the JEO Sri Veerabrahmam, CVSO Sri Sreedhar, SP Sri Subbarayudu and with the officials of various departments of TTD inspected the ongoing arrangements on Saturday evening.
As a part of this, the EO directed the officials concerned that precautions should be taken regarding sanitation, Medical facilities, security measures, distribution of Anna Prasadam, cultural programs at Shilparamam, Asthana Mandapam of Tiruchanoor, Annamacharya Kalamandiram, Sri Ramachandra Pushkarini besides dancing troupes in front of Vahana Sevas.
Regarding Engineering works, he said whitewashing, painting, flexi boards and arches at important places, barricades, PA system, electrical illumination should be set up.
He also instructed that the flower exhibition by the Garden wing in Friday Gardens should be attractive, matching the occasion.
In coordination with different district wings the annual fete should be conducted in a grand manner like Tirumala Brahmotsavams, he asserted.
Agama Advisor Sri Srinivasacharyulu, FACAO Sri Balaji, CE Sri Satyanarayana, SE Electrical Sri Venkateswarulu, DyEO Sri Govindarajan and other officers were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు
తిరుపతి, 2024, నవంబర్ 23: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామల రావు తెలిపారు. తిరుచానూరులోని పసుపు మండపం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో తిరుపతి టిటిడి జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివీఎస్వో శ్రీ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, జేసీ శ్రీ శుభన్ బన్సాల్ తదితర అధికారులతో కలిసి శనివారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబర్ 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాలతో ఆకర్షణీయంగా ఉండేలా ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని కోరారు.
శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని ఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు మెరుగ్గా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, తోళప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, పోలీసు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యనారాయణ, ఎఫ్ ఏ&సీఏవో శ్రీ బాలాజీ, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, తదితర టిటిడి, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.