KOIL ALWAR HELD _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATI, 28 JANUARY 2025: The traditional religious temple cleaning ritual of Koil Alwar Tirumanjanam in connection with Radha Saptami on February 04 was observed in Sri Padmavati Ammavari temple at Tiruchanoor on Tuesday
The entire temple, sub-temples and puja utensils were cleansed with an aromatic ”Parimalam” mixture from 6am till 9am.
Paradas Donated
Hyderabad-based Sri Venkata Ramprasad Verma has donated 08 large temple door curtains to the temple and handed over them to DyEO Sri Govindarajan. Archaka Sri Babu Swamy was also present.
Meanwhile, the temple authorities have cancelled Kalyanotsavam, Sahasra Deepalankara Sevas following the Koil Alwar Tirumanjanam.
AEO Sri Devarajulu, Superintendent Sri Ramesh, temple inspectors Sri Chalapathi, Sri Subba Rayudu were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2025 జనవరి 28: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల మధ్య కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తారు. రథసప్తమి, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని చేపడుతారు.
8 పరదాలు అమ్మవారికి బహుకరణ:
హైదరాబాద్ కు చెందిన శ్రీ వెంకట రామ ప్రసాద్ శర్మ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం 8 పరదాలను బహుకరించారు. ఈ పరదాలను డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అర్చకులు శ్రీ బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేశ్, ఆలయ ఇన్పెక్టర్లు శ్రీ చలపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 4న రథసప్తమి
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న మంగళవారం రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటి నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 – 7 గం.ల మధ్య చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 – 9.30 గంటల వరకు గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.
రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 4న ఆలయంలో శ్రీ అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్ సేవ, వేదాశీర్వచనం సేవలతోపాటు బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయడమైనది.
శ్రీ సూర్యనారాయణస్వామి వారి ఆలయంలో
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
తితిదే ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.