LOK SABHA SPEAKER OFFERED PRAYERS TO GODDESS PADMAVATHI _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో లోక్‌సభ స్పీకర్‌ శ్రీమతి మీరాకుమార్‌

Tirupati, 27 April 2013: Hon’ble Speaker of Lok Sabha Smt. Meira Kumar accompanied by her Husband Sri Manjul Kumar had darshan of Goddess Padmavathi at Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on Saturday evening.  On her arrival infront of the temple TTD Chairman Sri K.Bapi Raju, TTD EO Sri L.V.Subramanyam and temple priests welcomed her with temple honors. After darshan of the Goddess, TTD EO presented ammavari Prasadam to the Lok Sabha Speaker  inside the Temple.

 

Earlier TTD EO gave a warm reception on her arrival at TTDs Padmavathi Guest House in Tirupati.

 

APLC Chairman Sri Chakrapani, TTD Joint Executive Officer Sri P.Venkatarami Reddy, CVSO Sri GVG Ashok Kumar, DyEO Sri Gopalakrishna, Temple Supdt Sri Dharmaiah and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో లోక్‌సభ స్పీకర్‌ శ్రీమతి మీరాకుమార్‌

తిరుపతి, ఏప్రిల్‌  27, 2013: లోక్‌సభ స్పీకర్‌ గౌ|| శ్రీమతి మీరాకుమార్‌ శనివారం మధ్యాహ్నం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ స్పీకర్‌కు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మీరాకుమార్‌ ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలను, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని స్పీకర్‌కు అందించారు.

అంతకుముందు స్పీకర్‌ శ్రీమతి మీరాకుమార్‌ రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ రామచంద్రయ్య, మంత్రి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, శాసనమండలి ఛైర్మన్‌ శ్రీ చక్రపాణి, తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ లోక్‌సభ స్పీకర్‌కు స్వాగతం పలికారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.