TIRUCHANOOR BRAHMOTSAVAM ARRANGEMENTS REVIEWED _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు- టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి

TIRUPATI, 02 NOVEMBER 2023: TTD EO Sri AV Dharma Reddy directed the officials to make elaborate arrangements for the upcoming mega-religious event of the annual Karthika Brahmotsavams of Tiruchanoor Sri Padmavati Ammavaru in a grand manner.

A meeting was held with the District Collector, SP, Municipal Corporation Commissioner and other TTD officials in the conference hall of the TTD administration building in Tirupati on Thursday.

Speaking on the occasion, the EO directed the officials to co-ordinate with the district administration, Tirupati Municipal Corporation and police officials to make arrangements so that the devotees who come for Ammavari Brahmotsavam do not face any inconvenience.

As more number of devotees are expected to come for Gaja Vahanam on November 14 and Panchami Theertham on November 18, he asked to arrange traffic regulations and barricades in coordination with the police officials.

He said that on the day of Panchami Theertham, the Srivari Padi procession starts from Alipiri Padala Mandapam and reaches the Ammavari Temple via Komalamma Satram and Pasupu Mandapam.  He suggested that traffic arrangements should be made without any problems for the elephants along the road and this road should be kept clean in coordination with Tirupati Corporation officials.

German sheds should be set up at Navajeevan Eye Hospital, Zilla Parishad High School and Pudi Road for the devotees who wait for Pushkarini bath, where queue lines, drinking water and Annaprasadam arrangements should be made available for the devotees.  In view of Panchami Theertham, the surveillance and security officials have been directed to inspect the security arrangements at the field level along with the district SP. 

Keeping in view the rush of devotees especially for Panchami Theertham, the health department officials have been advised to keep as many bottles of drinking water ready as possible and also to arrange additional sanitation staff.  

Tirupati District Collector Sri Venkataramana Reddy, SP Sri. Parameswar Reddy, JEOs Smt. Sada Bhargavi, Sri Veerabraham, CVSO Sri Narasimha Kishore, Municipal Corporation Commissioner Smt Haritha, Tiruchanoor Temple Deputy EO Sri Govindarajan, Archakas Sri Babuswamy, Sri Manikantha Swamy and other officials participated.   

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

– నవంబర్ 18న‌ పంచమి తీర్థానికి అమ్మవారి పుష్కరిణి ముస్తాబు

– టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి

తిరుపతి, 02 న‌వంబ‌రు 2023: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గ‌ల సమావేశ మందిరంలో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కార్పొరేషన్ క‌మిష‌న‌ర్ ఇత‌ర టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 14న గ‌జ వాహనం, 18న పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు వ‌చ్చే అవకాశం ఉందని, పోలీసుల అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పంచమితీర్థం నాడు శ్రీవారి పడి ఊరేగింపు అలిపిరి పాదాలమండపం నుంచి మొదలవుతుందని, కోమలమ్మ స‌త్రం, పసుపు మండపం మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. దారి పొడవునా గజరాజులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని, తిరుపతి కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

పుష్క‌రిణి స్నానం కోసం వ‌చ్చే భ‌క్తులు వేచి ఉండేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, జిల్లా పరిషత్ హైస్కూల్, పూడి రోడ్డు వ‌ద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని, ఇక్కడ భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పంచమి తీర్థానికి ముందస్తుగా జిల్లా ఎస్పీతో కలిసి భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని నిఘా, భద్రత అధికారులను ఆదేశించారు. పంచమి తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైనన్ని తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని, అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు. అదేవిధంగా సిమ్స్, కేంద్రీయ వైద్యశాల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య శిబిరం, ప్రథ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. అమ్మవారి వాహనాలు, తండ్ల పటిష్టతను ముందస్తుగా పరిశీలించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహన సేవలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ ప్రాంతాల నుంచి కళాబృందాలను ఆహ్వానించాలన్నారు. న‌వంబ‌రు 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, 9న ల‌క్ష కుంకుమార్చ‌న‌, అంకురార్ప‌ణ‌కు త‌గిన ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. వాహనసేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలన్నారు.

ఈ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, జెఈవోలు శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ శ్రీ‌మ‌తి హ‌రిత, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అర్చ‌క స్వాములు శ్రీ బాబుస్వామి, శ్రీ మ‌ణికంఠ స్వామి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.