ALL SET FOR TIRUCHANOOR BTU – TTD EO _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

•  ELABORATE ARRANGEMENTS FOR DEVOTEES

Tirupati,27, November 2024: TTD Evo Shri J. Shyama Rao said TTD has made all elaborate arrangements for the successful conduct of the annual Brahmotsavam fete of Sri Padmavati ammavari temple, Tiruchanoor from November 28-December 6.

Speaking to media persons after an extensive inspection with TTD officials on the preparations on Wednesday the TTD EO  said TTD has geared up coordinated efforts of all departments to ensure a smooth and comfortable spiritual environment for devotees.

Among others, he said colourful electrical decorations, rangolis, Qlines, barricades are organised at Ammavari temple and Mada streets at Tiruchanoor.

He said a total of 20 LED screens have been set up in the surrounding areas of Tiruchanur and on the four sides of the Padma Pushkarini to enable the devotees to witness the Brahmotsavam fete.

He said that gates organised to enable the devotees to enter and return to Pushkarini, temporary toilets, signboards, and radio and broadcasting are in place.

He said   On the Panchami Teertham snanam fete 4 holding points have been set up at ZP High School, Pudi Road, Navajeevan and Tiruchanur Gate for the devotees to wait from the evening of 5th December night onwards.  tTD has made arrangements for the supply of drinking water, badam milk, bisbele bath, curd rice, vegetable upma and sweet Pongal to more than 50 thousand devotees through a total of 120 counters,  

He said that as part of Anna Prasadam rice, dal, sambar, rasam, sweet and curry will be distributed to 10,000 devotees on a daily basis.

All the Vahana Sevas will be telecast live on SVBC in HD as well as through SVBC online radio and YouTube. He said that 1000 artists are participating in the Sri Padmavati Ammavari Sare Sobhayatra organized from Alipiri to Tiruchanur in Ammavari Vahana Seva. 

He said that 300 sanitation workers have been appointed daily and 600 sanitation workers additionally on Panchmithirtham day. He said that tight security arrangements were made with 460 TTD security personnel and district police during Brahmotsavam and 1500 police and 600 vigilance personnel specially on Panchami Theertham day.

Daily 500  Srivari Sevaks 1000 sevaks and 200 scouts and guides will serve the devotees on Panchmithirtha day. On the last day on the 6th of December, it is customary to present a saree to the goddess from the Tirumala Srivari temple to celebrate the Panchmithirtham festival.  He said that Snpana Thirumanjanam will start at 10 am and Panchamithirtham Chakrasnanam will be conducted at Padma Pushkarini between 12.15 pm.

Along with EO, JEO Sri Veerabrahman, CVSO Sri Sridhar, CE Sri Satyanarayana, SE Sri Jagadeeswar Reddy, Deputy EO Sri Govinda Rajan, VGO Smt Sada Lakshmi and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

•⁠ ⁠భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు

•⁠ ⁠టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు

తిరుప‌తి, 2024 న‌వంబ‌రు 27: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వతేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు చెప్పారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌ అలంకరణలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామ‌న్నారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అందిస్తామ‌న్నారు.

పంచ‌మి తీర్థం సంద‌ర్భంగా డిసెంబ‌రు 5వ తేదీ సాయంత్రం నుండి భ‌క్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన‌ జడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామ‌న్నారు. ఇందులో మొత్తం 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50 వేలకు పైగా భ‌క్తుల‌కు తాగునీరు, బాదంపాలు, బిస్మిల్లా బాత్, పెరుగు అన్నం, విజిటబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చెక్కెర పొంగలి అందించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు రోజుకు 10 వేల మందికి సాంప్రదాయ బద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్ తో పాటు ఈ సారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేస్తామ‌న్నారు.

అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీలో హెచ్‌డి క్యాలిటితో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు, ఎస్వీబీసీ ఆన్ లైన్ రేడియో, యూట్యూబ్ ద్వారా కూడా ప్ర‌సారాలు అందిస్తామన్నారు. అమ్మవారి వాహన సేవలో ఏడు రాష్ట్రాల నుండి క‌ళాబృందాలు, అలిపిరి నుంచి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీపద్మావతి అమ్మవారి సారె శోభ‌యాత్ర‌లో 1000 మంది కళాకారులు పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. బ్రహోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించిన‌ట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది, పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశామ‌న్నారు.

బ్రహోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమితీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందిస్తార‌న్నారు. అమ్మ‌వారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 6వ తేదీ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంద‌న్నారు. ఉదయం 10 గంటలకు అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం మొదలవుతుంద‌ని, మధ్యాహ్నం 12.15 గంటల మ‌ధ్య ప‌ద్మ పుష్క‌రిణిలో పంచమితీర్థం చక్రస్నానం నిర్వహించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఈవో వెంట జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధ‌ర్‌, సిఇ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, ఎస్ ఇ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజ‌న్‌, విజివో శ్రీ‌మ‌తి స‌దాల‌క్ష్మీ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.