NAVARATRI FESTIVITIES COMMENCE AT SRI PAT _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 17 October 2020: The Navaratri festivities commenced at the Sri Padmavati Ammavari temple, Tiruchanoor on Saturday in which Ammavaru blessed devotees in different avatars during all 10 days of the colourful festival held in ekantham due to Covid-19 restrictions.

As part of the festivities the utsava idol of Sri Padmavati was given Snapana thirumanjanam at the Sri Krishna swami Mandapam. Later at night Unjal seva was also observed.

On October 26, Gaja vahana seva, a favourite vahana of Goddess Sri Padmavati will be performed in the temple.

As a result of Navaratri festivities the TTD has cancelled Kalyanotsavam, Sahasra Deepalankara seva on all ten days and the Lakshmi Puja on October 23.

Senior TTD officials and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2020 అక్టోబ‌రు 17: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శ‌నివారం ప్రారంభ‌మ‌య్యాయి. ప‌ది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంత‌రం రాత్రి ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఊంజల్‌సేవ నిర్వహించారు.

అక్టోబరు 26వ తేదీనాడు ఆల‌యంలో గజ వాహనసేవ చేప‌డ‌తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌, అక్టోబరు 23న ల‌క్ష్మీపూజ సేవ‌లు రద్ద‌య్యాయి.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.