SOMASKANDA APPEARS ON TIRUCHI _ తిరుచ్చిపై సోమస్కందమూర్తి
Tirupati, 26 Feb. 22: Sri Soma Skandamurty appeared on Tiruchi vahanam, as part of ongoing annual Brahmotsavams in Sri Kapileswara Swamy temple on Saturday morning.
Due to Covid restrictions, the vahana sevas are taking place in Ekantam in the temple premises itself.
Temple DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati, Temple Inspector Sri Reddy Sekhar were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుచ్చిపై సోమస్కందమూర్తి
తిరుపతి, 2022 ఫిబ్రవరి 25: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
శివచింతన కోసం కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేస్తున్నారు. మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి తపమాచరిస్తున్నారు. ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో ఒంటికాలి మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ తమ చిత్తసరోజాలను పరమేశ్వరార్పణ చేయడానికే. కానీ మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల చిత్తం అయత్నంగా పరమశివ పదాయత్తమవుతుంది.
వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.