SOMASKANDA MURTHY ON TIRUCHI VAHANAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ తిరుచ్చిపై సోమస్కందమూర్తి
TIRUPATI, 16 FEBRUARY 2026: On the ninth day of the annual Brahmotsavams at the Sri Kapileswara Swamy Temple, Sri Kamakshi Sameta Sri Somaskanda Murthy blessed devotees on the Tiruchi Vahanam on Monday night.
The Vahana Seva was taken out in a grand procession through the temple streets amid devotional bhajans, kolatams by bhajana mandalis, and the rhythmic sounds of traditional mangala vadyams.
Devotees participated in large numbers and offered camphor haratis with devotion.
According to temple tradition, devotees who have darshan of Lord Kapileswara Swamy on the Tiruchi Vahanam during the Brahmotsavams are believed to have their wishes fulfilled.
Earlier, from 6:00 PM to 8:00 PM, the Kalyana Mahotsavam of Sri Kamakshi Sameta Kapileswara Swamy was performed with grandeur. A large number of devotees participated in the celestial wedding ceremony.
Householders who took part in the Kalyanotsavam were presented with laddu prasadam as a blessing.
Foreign devotees from Russia keenly witnessed the cultural programmes organized on the occasion and expressed their happiness.
Temple Superintendent Sri Chandrasekhar, other officials, temple archakas, and a large number of devotees participated in the programme.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుచ్చిపై సోమస్కందమూర్తి
తిరుపతి 2026 ఫిబ్రవరి 16: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన సోమవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు.
భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు.
మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరతాయని ఐతిహ్యం.
కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రష్యా నుండి వచ్చిన విదేశీ భక్తులు ఆద్యంతం తిలకించి ఆనందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ , ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.















