తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 19వ తేది నుండి శ్రీరామనవమి ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 19వ తేది నుండి శ్రీరామనవమి ఉత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌  12, 2013: తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 19వ తేది నుండి మూడు రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి పర్వదినాన  తెల్లవారు జామున  ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, మూలవర్ల తిరుమంజనం జరుగనుంది. రాత్రి హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుడు ఆలయ నాలుగు మాఢవీధులలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏప్రిల్‌ 20వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనదలచిన గృహస్తులు రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చు. ఏప్రిల్‌ 21వ తేదీ ఆదివారం శ్రీరామపట్టాభిషేకం జరుగనుంది. ఏప్రిల్‌ 23,24 మరియు 26వ తేదీన  శ్రీరామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాలు జరుగనున్నాయి.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.