TIRUPATI EVENTS FOR BTU _ తిరుపతిలో ఆకట్టుకున్న ధార్మిక కార్యక్రమాలు

Tirupati, 09 October 2024: The cultural programs organised by TTD in Tirupati in connection with the annual brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala impressed the denizens on Wednesday.

A series of Bhakti Sangeet and dance programs held at Ramachandra, Pushkarini, Mahathi Auditorium and Annamacharya Kalamandiram attracted the local devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతిలో ఆకట్టుకున్న ధార్మిక కార్యక్రమాలు
 
తిరుపతి, 2024 అక్టోబ‌రు 09; తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలతో పురప్రజలు ఆకట్టుకున్నాయి.
 
ఇందులో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు శ్రీ విజయ కార్తీక్, శ్రీ ఇళయరాజా బృందం వాద్య సంగీతం, రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు శ్రీ వేణుగోపాల్ బృందం భరతనాట్య ప్రదర్శన  నిర్వహించారు. 
 
అన్నమాచార్య కళామందిరంలో కడపకు చెందిన శ్రీ నటరాజ్ బృందం సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 గంటల వరకు వాద్య సంగీతం, రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు కడప ఒక చెందిన శ్రీ సూర్యప్రసాద్ నాట్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. 
 
రామచంద్ర పుష్కరణ వద్ద శ్రీ భార్గవ్ రంగనాథ్ బృందం కర్ణాటక భక్తి సంగీత కార్యక్రమం  పురప్రజలను అలరించింది.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.