ELABORATE ARRANGEMENTS FOR KARTHIKA MAHA DEEPOTSAVAM IN TIRUPATI: JEO _ తిరుపతిలో కార్తీక మ‌హా దీపోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం

Tirupati, 14 November 2024: TTD JEO Sri Veerabrahmam said that TTD is making elaborate arrangements for the Karthika Maha Deepotsavam to be organised on the night of November 18 at the TTD Administration Building Parade Ground in Tirupati. 

He held a coordination committee meeting with the concerned senior officials at his Chamber on Thursday. 

Speaking on the occasion, the JEO urged the devotees to participate in the Karthika Maha Deepotsavam organized under the auspices of HDPP wing of TTD.

He said that this program will be broadcast live through SVBC. Devotees who cannot come to this program shall watch it live on SVBC. 

As part of this, lamp posts and ghee pots are being arranged for women to sit and light the traditional lamps. 

The entire ground will be carpeted and a Tulsi plant will be placed at each lamp post. These plants will be given to the women as Vriksha Prasadam after the program.

The stage will be decorated with flowers, electric illumination, and settings on both sides of the stage to create a sense of spirituality. 

Special arrangements are being made for the Sri Mahalakshmi Puja to be held as part of the program. The entire premises from the main gates of the TTD administration building will be decorated with banana trees, flowers, and electric light decors. 

Barricades will be set up on the ground under the auspices of the Engineering Department.

HDPP Secretary Sri Raghunath, Program Officer Sri Rajagopal, Additional Secretary Sri Ramgopal, SE (Electrical) Sri Venkateswarlu and other officials participated in the meeting. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతిలో కార్తీక మ‌హా దీపోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి జేఈవో
శ్రీ వి.వీరబ్రహ్మం

తిరుప‌తి‌, 2024 న‌వంబ‌రు 14: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో నవంబరు 18వ తేదీ రాత్రి నిర్వహించనున్న కార్తీక మ‌హాదీపోత్స‌వానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టనున్నట్లు టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం తెలిపారు. టిటిడి పరిపాలనా భవనంలోని జేఈవో ఛాంబర్ లో సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాలేని భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని సూచించారు.

ఇందులో భాగంగా మ‌హిళ‌లు కూర్చుని దీపాలు వెలిగించేలా దీప‌పు దిమ్మెలు, నేతి వ‌త్తులు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వ‌ద్ద తుల‌సి మొక్క‌ను ఉంచనున్నారు. కార్య‌క్ర‌మం అనంత‌రం మ‌హిళ‌లకు ఈ మొక్క‌ల‌ను అందిస్తారు.

వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వహించనున్న శ్రీ మ‌హాల‌క్ష్మీపూజ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్ర‌ధాన ద్వారాల నుంచి ఆవ‌ర‌ణం మొత్తం అర‌టి చెట్లు, పూలు, విద్యుద్దీపాల‌తో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో హెచ్ డిపిపి సెక్రటరీ శ్రీ రఘునాథ్, ప్రొగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, అడిషనల్ సెక్రటరీ శ్రీ రాంగోపాల్, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.