TTD EO INSPECTED DIVYA DARSHAN TOKEN CENTRE AT TIRUPATI _ తిరుపతిలో దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని తనిఖీ చేసిన టిటిడి ఈవో
Tirupati, 24 August 2024: TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdhary inspected the SSD and Divya Darshan token centre at the Bhudevi complex in Alipiri on Saturday.
TTD EO reviewed the feasibility of reviving the Divya Darshan tokens issued at Alipiri once again. Thereafter he inspected the SSD token issue process, SVBC master control room and old SVBC building.
He instructed the officials to speed up the comfortable issue of Tokens and other development activities.
He also visited the jala prasadam units, luggage counters at Alipiri and gave valuable instructions to the concerned officials.
JEO Sri Veerabrahmam, CVSO Sri Sridhar, CE Sri Nageswar Rao, SVBC CEO Sri Shanmukh Kumar were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతిలో దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని తనిఖీ చేసిన టిటిడి ఈవో
తిరుపతి, 2024 ఆగష్టు 24: తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం, ఎస్ఎస్ డి టోకెన్ల జారీ కేంద్రాన్ని శనివారం టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు.
అలిపిరి వద్ద భక్తులకు ఇదివరకు జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్లను పునః ప్రారంభించేందుకు సాధ్యసాధ్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం
ఎస్ఎస్ డి టోకెన్ల జారీ ప్రక్రియను, క్యూ లైన్లను, ఎస్విబిసి మాస్టర్ కంట్రోల్ రూమ్ ను, ఎస్విబిసి పాత పరిపాలన భవనాన్ని పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్లు జారీ చేయడానికి శాశ్వత క్యూలైన్లు, ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తరువాత అలిపిరి పాదాల మండపం వద్ద ఇదివరకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని, టిటిడి జలప్రసాదాన్ని, లగేజీ కౌంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈవో వెంట జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్వో శ్రీ శ్రీధర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.