TIRUPATI CHEERS THE PROGRAMS _ తిరుపతిలో భక్తి భావాన్ని పంచిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు
TIRUPATI, 11 OCTOBER 2024 : The denizens of Tirupati gave a thumbs up to all the cultural programs organized by TTD.
On Friday evening, the devotional cultural programs at Mahati, Annamacharya Kalamandiram, Sri Ramachandra Pushkarini were impressive.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతి, 2024 అక్టోబరు 11 ;శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తిరుపతిలోని వివిధ వేదికలపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు పురప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ సుధాకర్, శ్రీ శ్రీనివాసులు, శ్రీమతి అనంతలక్ష్మి, శ్రీ శ్రీకృష్ణ, శ్రీమతి వాణి బృందం నిర్వహించిన భక్తి సంగీతం పుర ప్రజలను అలరించింది.
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీమతి కార్తీక బృందం సంగీత కార్యక్రమం జరిగింది.
శ్రీ రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి మంజుల బృందం హరికథ గానం చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.