తిరుపతిలో 4 కేంద్రాల్లో ”శుభప్రదం” తరగతులు

తిరుపతిలో 4 కేంద్రాల్లో ”శుభప్రదం” తరగతులు

తిరుపతి, మే 09, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మే 12 నుండి 18వ తేదీ వరకు ”శుభప్రదం” పేరిట నిర్వహించనున్న వేసవి శిక్షణ తరగతులు తిరుపతిలో నాలుగు కేంద్రాల్లో జరుగనున్నాయి. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న బాలబాలికలు మే 11వ తేదీ సాయంత్రం 4.00 గంటల లోపు ఈ కింది కేంద్రాలకు చేరుకోవాలి.

కడప, కరీంనగర్‌, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లోని బాలికలు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలకు, అనంతపురం, నెల్లూరు, వరంగల్‌ జిల్లాల్లోని బాలికలు శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాలకు, గుంటూరు, కర్నూలు, మెదక్‌, ప్రకాశం జిల్లాలకు చెందిన బాలికలు శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్‌ కళాశాలలోని శిక్షణ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని బాలురు, వైఎస్‌ఆర్‌ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రామాపురం, రాయచోటి, టి.సుండుపల్లి, బి.మఠం, చక్రాయపేట, ఒంటిమిట్ట, బద్వేల్‌, బి.కోడూరు మండలాల బాలురు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూనియర్‌ కళాశాలలోని శిక్షణ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.