తిరుపతి కల్చరల్ అకాడమిపై టిటిడి చర్యలు
తిరుపతి కల్చరల్ అకాడమిపై టిటిడి చర్యలు
తిరుపతి, 2010 ఫిబ్రవరి 22: తితిదే ఆధ్వర్యంలోని మహతి ఆడిటోరియంను 21వ తేది మధ్యాహ్నం 4.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు తిరుపతి కల్చరల్ అకాడమి వారికి అంధులకు, వికలాంగులకు దుస్తుల పంపిణీ మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు గాను విద్యుత్ చార్జీలు వసూలు చేస్తు కేటాయించడమైనది.
ఆ క్రమంలో వారు నిన్న సాయంత్రం 4-00 గంటలకు భక్తి గీతాలతో తమ ప్రోగ్రామును ప్రారంభించారు. తదుపరి రాత్రి 8.30 గంటల వరకు ముఖ్య అతిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. అటు పిమ్మట సినిమా నృత్యప్రదర్శన ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకొన్న ఇ.ఓ. గారి ఆదేశాల మేరకు తితిదే సిబ్బంది ఆ నృత్యప్రదర్శనను అడ్డుకొని కార్యక్రమాన్ని అర్థాంతరంగా రద్దుచేసి అందరిని బయటకు పంపివేశారు.
ఈ గందరగోళానికి కారణమైన తిరుపతి కల్చరల్ అకాడమిని భవిష్యత్తులో తితిదేలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండ శాశ్వతంగా బహిష్కరించడం జరిగింది.
ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుండా ప్రస్తుతం వసూలు చేస్తున్న కాషన్ డిపాజిట్టును రు.18,000/- నుండి లక్ష రూపాయలకు పెంచుతూ, భవిష్యత్తులో ఎవరైనా తితిదే వారి నియమనింధనలను అతిక్రమిస్తే వారు చెల్లించిన డిపాజిటును రుసుము ఒక లక్ష రూపాయలు తితిదే ఖాతాకు జమ చేస్తూ ఆ సంస్థను తితిదేలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండ శాశ్వతంగా బహిష్కరించేలాగున ఇఓ గారు ఆదేశాలు జారీచేశారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు తితిదే ఉద్యోగులైనందున వారి వివరణను కూడా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.