తిరుపతి జిల్లాలోని నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు
తిరుపతి జిల్లాలోని నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు
ఆలయ సిబ్బంది పై శాఖాపరమైన చర్యలు
తిరుపతి/నాగలాపురం 2026 ఆగస్టు 02: తిరుపతి జిల్లా నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమే కాకుండా ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ తమ సెల్ ఫోన్ తో ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన నెల్సన్ మండేలా అనే వ్యక్తితో పాటు మరో నలుగురిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు. కేసు నమోదు చేయడం జరిగింది.
సదరు ఘటనా సమయంలో అప్రమత్తంగా లేకుండా ఉన్న టీటీడీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యల కై ఆదేశించడం జరిగింది.
ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. ఇలాంటి వారిపై టీటీడీ చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
