VAIKUNTHA DWARA DARSHAN TOKENS FOR TIRUPATI-TIRUMALA LOCALS THROUGH E-DIP _ తిరుపతి, తిరుమల స్థానికులకు ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

E-DIP REGISTRATION FROM DECEMBER 25 TO 27

TOKEN ALLOTMENT ON DECEMBER 29

Tirumala, 12 December 2025: It is well known that TTD has decided to allocate local quota tokens for Vaikuntha Dwara Darshan to residents of Tirumala, Tirupati, Renigunta, and Chandragiri during the Vaikuntha Dwara Darshan to be held in Tirumala Sri Venkateswara Temple from December 30 to January 8.

Under this, 5,000 tokens per day will be allotted for the dates January 6, 7, and 8.

Accordingly, TTD will provide the facility for e-Dip registration from 10 AM on December 25 to 5 PM on December 27.

Residents of Tirumala, Tirupati, Renigunta, and Chandragiri can register for the e-Dip under the 1+3 system through the TTD website, mobile app, and WhatsApp during the mentioned dates.

The allotment of tokens through e-Dip will take place at 2 PM on December 29.

Out of the total daily quota, 4,500 tokens will be allotted to residents of Tirupati, Renigunta, and Chandragiri, and 500 tokens will be allotted to Tirumala residents.

TTD requests all eligible local residents to make note of this and register for tokens through the e-Dip system.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

 

తిరుపతి, తిరుమల స్థానికులకు డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

డిసెంబర్ 25 నుండి 27 వరకు డిప్ నమోదుకు అవకాశం 

29 తేదిన టోకెన్లు కేటాయింపు 

తిరుమల, 2025 డిసెంబర్ 12: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది. 

తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులు పైన పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది.

ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు.

ఈ విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.