SRI RAM NAVAMI CELEBRATIONS IN GRANDEUR AT SRI KODANDA RAMA TEMPLE IN TIRUPATI _ శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
Tirupati, 06 April 2025: Sri Ram Navami celebrations were held in grandeur at the Sri Kodanda Rama Swamy Temple in Tirupati on Sunday.
Between 8am and 9 am, a grand Snapana Tirumanjanam was performed for the Utsava deities of Sri Sita Rama, Lakshmana and Hanuman in the Unjal Mandapam.
Between 3pm and 4 pm, Sri Rama Navami Asthanam was performed.
From 7pm to 9 pm, Sri Ramachandramurthy will ride His beloved Hanumanta Vahanam and bless the devotees.
Both the Tirumala Pontiffs, temple officials, devotees participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
తిరుపతి, 2025, ఏప్రిల్ 06: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
తెల్లవారు జామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఊంజల్ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠం నుండి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొని విమాన ప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపురాణం, ఆస్థానం నిర్వహించారు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ముని శంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.