KOIL ALWAR TIRUMANJANAM HELD IN KT _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 15 February 2025: The ceremonious Koil Alwar Tirumanjanam was held on Saturday in the background of Brahmotsavam from February 19 to 28 at Sri Kapileswara Swamy temple in Tirupati.

It is customary to perform Koil Alwar Tirumanjanam, the temple cleansing fete before Brahmotsavam.  

On this occasion, the presiding deity was awakened in the morning with Suprabhatam and Abhishekam was performed. .

After that Koil Alwar Tirumanjanam was held from 11.30 am to 3 pm. 

On this occasion, the sanctum sanctorum, Dhwaja Sthambham, sub-temples and temple surroundings were cleaned.

Temple Deputy EO Sri Devendra Babu, temple priests and other officials participated in this program.

Details of Vahana Sevas:

 19-02-2025

 Morning – Dhwajarohanam (in Makara Lagna)

 Night – Hamsa

 20-02-2025

 Morning – Surya Prabha 

 Night – Chandra Prabha 

 21-02-2025

 Morning – Bhoota 

 Night – Simha 

 22-02-2025

Morning – Makara 

 Night – Shesha 

 23-02-2025  

Morning – Tiruchi 

 Night – Adhikara Nandi 

24-02-2025

Morning – Vyaghra 

Night –  Gaja

25-02-2025

Morning – Kalpavriksha 

Night – Aswa

26-02-2025

Morning – Rathotsavam (Bhogiteru)

Night – Nandi vahanam

27-02-2025

Morning – Purushamriga 

Evening – Kalyanotsavam,

 

 Night – Tiruchi 

 28-02-2025

 Morning – Trisula Snanam

Evening – Dhwajavarohanam 

Night – Ravanasura

All the Vahana Sevas will be held from 7 am to 9 am in the morning and again from 7 pm to 9 pm in the evening during Brahmotsavams.  

On the occasion of the mega festival, TTD Hindu Dharma Prachara Parishad will organize kolatams and bhajan programs before Vahana sevas every day.  Artists of the Annamacharya Project will sing Annamayya Sankeertans.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 15: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 19 నుండి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలుజరుగనున్న నేప‌థ్యంలో శ‌నివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘ‌నంగా జరిగింది.

బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.

ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

19-02-2025
ఉద‌యం – ధ్వజారోహణం (మకర లగ్నంలో)

రాత్రి – హంస వాహనం

20-02-2025
ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

21-02-2025
ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం

22-02-2025
ఉద‌యం – మకర వాహనం

రాత్రి – శేష వాహనం

23-02-2025
ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం

24-02-2025
ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం

25-02-2025
ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం

26-02-2025
ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం

27-02-2025
ఉద‌యం – పురుషామృగవాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం

28-02-2025
ఉద‌యం – త్రిశూలస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం

బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్రతి రోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది