CONSENT LETTERS INVITED FROM TIRUPPAVI PARAYANADARS _ తిరుప్పావై ప్రవచనకర్తల నుండి అంగీకారపత్రాలకు ఆహ్వానం
తిరుప్పావై ప్రవచనకర్తల నుండి అంగీకారపత్రాలకు ఆహ్వానం
తిరుపతి, 16 సెప్టెంబరు 2024: పవిత్రమైన ధనుర్మాసంలో ఈ ఏడాది డిసెంబరు 16 నుంచి 2025 జనవరి 13వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు చెప్పేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన విద్వాంసుల నుంచి అంగీకారపత్రాలను టీటీడీ ఆహ్వానిస్తోంది. 2015 నుండి 2023వ సంవత్సరం వరకు తిరుప్పావై ప్రవచనాలు చెప్పిన వారు ఈ సంవత్సరం కూడా అంగీకారం తెలపాల్సిందిగా కోరడమైనది.
హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు అక్టోబరు 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టీటీడీ, తిరుపతి-517502” అనే చిరునామాకు తమ అంగీకారపత్రాలు పంపాల్సి ఉంటుంది. నమూనా అంగీకారపత్రాన్ని www.tirumala.org వెబ్‌సైట్‌లో పొందుపరచడమైనది.
ఇతర వివరాలకు టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల కార్యాలయాన్ని 9676120226, 8978734947 నంబర్లను కార్యాలయ వేళల్లో సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.