LETTERS INVITED FOR TIRUPPAVAI PRAVACHANAM _ తిరుప్పావై ప్రవచనాల నిర్వహణకు అంగీకారపత్రాల ఆహ్వానం
Tirupati, 04 November 2022: TTD has invited willing letters from Sri Vaishnava Vedic Pundits to render Tiruppavai Pravachanam in TTD temples across the country between December 17 to January 14 during holy Dhanur Masam.
TTD has been organising the Paravachanams since 2015 and invited pundits to present acceptance letters for forthcoming years as well.
It is well known that the annual Tiruppavai Pravachanam are being organised by the TTD’s Hindu Dharma Prachara Parishad in different locations of the country.
TTD requested the eligible and qualified pundits to submit their acceptance letters before 5 pm of November 25th and address them to “Special Officer, Alwar Divya Prabandam Project, SVETA Bhavan, TTD, Tirupati-517502.
The model of acceptance letters could be downloaded from the TTD website www.tirumala.org
For more details the interested persons shall contact TTD Dharmic projects office on mobile number: 9676120226 during office hours on working days.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుప్పావై ప్రవచనాల నిర్వహణకు అంగీకారపత్రాల ఆహ్వానం
తిరుపతి, 2022 నవంబరు 04: పవిత్రమైన ధనుర్మాసంలో ఈ ఏడాది డిసెంబరు 17 నుంచి 2023 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన విద్వాంసుల నుంచి అంగీకారపత్రాలను టిటిడి ఆహ్వానిస్తోంది. 2015 నుండి 2022వ సంవత్సరం వరకు తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించిన విద్వాంసులు ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరడమైనది.
హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు నవంబరు 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టిటిడి, తిరుపతి-517502” అనే చిరునామాకు అంగీకారపత్రాలు పంపాల్సి ఉంటుంది. నమూనా అంగీకారపత్రాన్ని www.tirumala.org వెబ్‌సైట్‌లో పొందుపరచడమైనది.
ఇతర వివరాలకు టిటిడి ధార్మిక ప్రాజెక్టుల కార్యాలయాన్ని 9676120226 పనిదినాల్లో కార్యాలయ వేళల్లో సంప్రదించగలరు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.