SRI RAMANAVAMI ASTHANAM AT SRI KRT IN TIRUPATI _ తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఆస్థానం
Tirupati, 2 April 2020: The prestigious event of Sri Ramanavami Asthanam as part of Sri Ramanavami festival celebrations was held at the TTD local temple of Sri Kodandarama Swamy temple on Thursday in Tirupati.
Earlier during the day as a part of the annual festival special Snapana Thirumanjanam was also organised for the utsava idols of Sri Sita Lakshmana Sametha Sri Ramachandra Swamy.
Later in the evening new sesha vastrams were offered on behalf of Sri Sri Sri Pedda Jeeyar swami at the temple ahead of the Sri Rama Janma Puranam and Asthanam events.
Temple Dyeo Smt Shanti and Superintendent Sri Ramesh participated.
SRI SITARAMA KALYANAM ON APRIL 7
In view of the Corona virus eradication programs, the TTD has cancelled the Sri Sitarama Kalyanam as mass programme with the participation of pilgrims. However the celestial event will be held in temple with limited temple staff as a part of Sri Ramanavami celebrations scheduled on April 7.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఆస్థానం
ఏప్రిల్ 02, తిరుపతి, 2020: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామనవమి ఆస్థానం ఏకాంతంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులకు అభిషేకం, ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజం నిర్వహించారు.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి తరఫున ఏకాంగులు నూతన వస్త్రాలను విమానప్రదక్షిణగా తీసుకొచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపురాణం, ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఏప్రిల్ 3న శ్రీ సీతారాముల కల్యాణం రద్దు
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 3వ తేదీన జరగాల్సిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని టిటిడి రద్దు చేసింది. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.