TTD BOARD MEETING RESOLUTIONS _ తిరుమలకొండపై పచ్చదనాన్ని మరింత పెంచుతాం: టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
TIRUMALA, 20 MAY 2025:The TTD Board meeting was held under the Chairmanship of the TTD Trust Board Chairman Sri B R Naidu along with the TTD EO Sri J Syamala Rao and other board members at Annamaiah Bhavan in Tirumala on Tuesday and taken some important resolutions in the larger interests of the devotees.
After the board meeting, TTD EO briefed the media on the important resolutions taken during the board meeting. Excerpts:
• As per the instructions of the Honourable CM of AP Sri Nara Chandrababu Naidu, the board has given a nod to increase the green cover in the Tirumala hills from the existing 68.14 percent to 80 percent through the Forest Department. After the government’s approval, it has been decided to release Rs. 4 crore to the Government Forest Department in phased manner including 1.74 crore for the year 2025-26, Rs. 1.13 crore in the year 2026-27, and Rs. 1.13 crore in the year 2027-28
– It has been decided to receive technical and financial proposals from architects (Consultants) to prepare a comprehensive master plan for the development of Tiruchanoor, Amaravati, Narayanavanam, Kapilatheertham, Nagalapuram and Vontimitta temples.
• All the rest houses in Tirumala have been renamed after the deities except two as the respective donors have not responded so far. The TTD board has decided that the names of these rest houses shall be changed by the TTD itself while with respect to Sainik Niwas (Indian Army) rest house, will be negotiated with the concerned for name change.
• Approval of the issue of fixing the license fee for Big Canteens and Janatha Canteens in Tirumala. It has been decided to give it to renowned institutions to provide quality food to the devotees.
• In the context of devotees visiting the Akashaganga and Papavinasanam areas in large numbers, it has been decided to formulate a plan to further enhance the spiritual, environmental and infrastructure facilities here.
– Approval has been given to provide an additional Rs. 71 crore per year in addition to the current Rs. 60 crore financial aid provided to the SVIMS Super Specialty Hospital, which is the flagship of Rayalaseema for providing better medical services to many poor and needy people.
-It has been decided to recruit doctors, nurses and paramedical staff posts which are currently vacant in SVIMS. and also to complete the buildings which are under construction making them available for the patients. The Board has also decided to introduce Srivari Vaidya Seva soon on the lines of Srivari Seva voluntary service inviting experts in the Medical field to offer services to the patients.
- Nod to take steps towards the transfer of non-religious people working in TTD through alternative ways or by giving them VRS- the Voluntary Retirement Scheme.
- Decision to use anti-drone technology keeping in mind the security aspect of Tirumala temple.
- Nod to enhance Annaprasadam services to devotees in Vontimitta.
- Decision to develop Sridevi and Bhudevi Sameta Sri Venkateswara Swamy Temple of TTD in Anantavaram, Tullur mandal by giving a nod to allocate Rs. 10 crores towards this.
• Decision to take legal action against the DD Next Level film crew for remixing the Govinda Namavali and hurting the sentiments of the devotees.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలకొండపై పచ్చదనాన్ని మరింత పెంచుతాం: టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
తిరుమల, 2025 మే 20: తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఉదయం టీటీటీ ధర్మకర్తల మండలి సమావేశం జరగింది. టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు మీడియాకు వివరించారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముఖ్య నిర్ణయాలు
• రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్నిఅటవీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణయం. ప్రభుత్వ ఆమోదం వచ్చాక దశలవారీగా 2025-26 సంవత్సరంలో రూ.1.74కోట్లు, 2026-27 సంవత్సరంలో రూ.1.13కోట్లు, 2027-28 సంవత్సరానికి రూ.1.13కోట్లు ప్రభుత్వ అటవీశాఖకు విడుదల చేసేందుకు నిర్ణయం.
• తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం.
• తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్దరు దాతలు స్పందించలేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయం. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
• తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదం. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం.
• ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం.
• రాయలసీమకే తలమానికంగా ఉంటూ ఎందరో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60కోట్లతో పాటు అదనంగా మరో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం. స్విమ్స్ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేందుకు నిర్ణయం. అదేవిధంగా 85శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవంతులను (ఆంకాలజీ మరియు పద్మావతి చిన్ని పిల్లల ఆసుపత్రిలతో కలిపి) త్వరలోనే మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణయం. శ్రీవారి వైద్య సేవను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం.
• టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్తులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు ఆమోదం.
• తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయం. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆధికారులకు ఆదేశం.
• ఒంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలను మరింత పెంచాలని నిర్ణయం.
• తుళ్లూరు మండలం అనంతవరంలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం.
• శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన డీడీ నెక్ట్స్ లెవల్ చిత్రబృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.