SEERS PARTICIPATE PURANDHARA DASA ARADHANA MAHOTSAVAM AT TIRUMALA _ భగవన్నామస్మరణ ముక్తికి మార్గం : పెజావ‌ర్ మ‌ఠం శ్రీ‌శ్రీ‌శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ‌స్వామీజీ

Tirumala, 28 January 2025: Pejawar Mutt Peethadhipathi Sri Sri Vishwaprasanna Theerthaswamyji, Sri Kokke Subramanya Pontiff Sri Sri Vidyaprasanna Tirtha Swamiji emphasized that Bhagavat Nama Smarana is the only way to attain salvation for human beings.  

Participating in Sri Purandara Dasa Aradhana Mahotsavam under the auspices of the TTD Dasa Sahitya Project which began at the Asthana Mandapam in Tirumala on Tuesday the Swamijis said that today, thousands of devotees sing lakhs of kirtans written by Purandardasa and sanctifying their lives.

They complimented that the Dasa Sahitya Project is working hard towards the promotion of Hindu Sanatana Dharma in a big way.  

Additional EO Sri Ch Venkaiah Chowdary said Sri Purandara Dasa was an embodiment of divine nature and the embodiment of Narada, and has written 4.75 lakh Sankeertans that includes the glory of Venkateswara.  Purandar Dasa’s life is an exemplary for mankind.  

Around 3,500 Bhajan mandals from the states of Andhra, Telangana, Tamil Nadu and Karnataka participated.

JEO Sri Veerabrahmam, Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భగవన్నామస్మరణ ముక్తికి మార్గం : పెజావ‌ర్ మ‌ఠం శ్రీ‌శ్రీ‌శ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ‌స్వామీజీ

గురువుల మార్గ‌ద‌ర్శ‌నంతో సుల‌భంగా శ్రీ‌వారి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు : శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ

తిరుమల, 2025 జనవరి 28: మాన‌వుల‌కు భగవన్నామస్మరణ ఒక్క‌టే ముక్తికి మార్గమని ఉడిపికి చెందిన పెజావ‌ర‌ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వ‌ప్ర‌స‌న్న‌తీర్థ‌స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సందర్భంగా స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ, భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని, ఈ కోవకు చెందిన పరమభక్తుడు శ్రీ పురందరదాసు అన్నారు. నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు. దాససాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న భజన మండళ్ల సభ్యులను అభినందించారు.

కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ, శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుండి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో పురందరదాసుల ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు హైందవ సనాతనధర్మ ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు.

టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. అనంత‌రం స్వామీజీలను శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదంతో స‌న్మానించారు.

అంతకుముందు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప‌లు దాస సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3,500 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పాల్గొన్నారు.

జనవరి 29న నారాయణగిరి ఉద్యానవనాల్లో సంకీర్తనాలాపన

ఆరాధ‌నోత్స‌వాల్లో భాగంగా జనవరి 29న బుధవారం సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు శ్రీవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి శ్రీ పురంద‌ర‌దాస సంకీర్తనల బృంద‌గానం నిర్వ‌హిస్తారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.