ADDITIONAL EO CONDUCTS SURPRISE INSPECTIONS IN TIRUMALA _ తిరుమలలో అడిషనల్ ఈవో ఆకస్మిక తనిఖీలు
Tirumala, 20 November 2024: TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary conducted surprise inspections in Tirumala on Wednesday evening.
On this occasion, he inspected the Annapurna Hotel building on DMB Road. Later, he personally inspected the licenses of the shops. He had tea at a tea shop and inquired about the prices.
Speaking to the media on this occasion, the Additional EO said that the inspection was carried out as the Annapurna Hotel building had reached a dilapidated state. He said that a decision will be taken on the building soon based on the report of the engineering officials.
He also said that it has come to his notice that businesses are being run in two or three areas with a single license and action will be taken to prevent misuse by digitizing the licenses.
He informed that strict action will be taken against those who are doing business illegally in Tirumala.
Deputy EO Health Smt Asha Jyothi, Electrical DE Sri Chandra Shekhar, VGO Sri Surendra, Revenue AEO Sri Narayana Chowdhary and other officials participated in the inspection.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో అడిషనల్ ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమల, 2024 నవంబరు 20: టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి బుధవారం సాయంత్రం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంబీ రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరాశీలించారు. అనంతరం దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేశారు. ఒక టీ దుకాణంలో టీ సేవించి ధరలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ హోటల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పరిశీలించడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ అధికారుల నివేదిక ఆధారంగా భవనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఒకే లైసెన్సుతో రెండు మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, లైసెన్సులను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ ఆశాజ్యోతి, ఎలక్ట్రికల్ డిఇ శ్రీ ఎన్.చంద్ర శేఖర్, వీజీవో శ్రీ సురేంద్ర, రెవెన్యూ ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.