SUPERIOR QUALITY OF ANNAPRASADAM AT TIRUMALA _ తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు – టీటీడీ ఛైర్మన్
Tirumala,05 December 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy said that TTD topped the religious institutions which provided high-quality of Annaprasadam to lakhs of devotees from all over the world who throng the hill shrine every day.
Speaking to media on Tuesday the TTD Chairman lamented that a section of social media had campaigned that some devotees had staged a protest recently at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex.
He said around 15 persons in the dining hall amongst 700 other pilgrims had pointed out the quality of food at Annaprasada Bhavan. He said TTD will never compromise on the quality. But these persons who complained about the food quality tried to intimidate others which is absolutely wrong in a pilgrim centre.
He said the food habits are personally divergent but in pilgrim centers devotees have to observe patience. TTD is ever prepared to set right any lapses, if any.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు – టీటీడీ ఛైర్మన్
తిరుమల, 2023 డిసెంబరు 05: తిరుమలకు ప్రతి రోజు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
తిరుమలలో మంగళవారం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాదాపు 700 మంది ఉన్నహాల్‌లో కేవలం 15 మంది మాత్రమే భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రెచ్చ కోట్టేవిధంగా మాట్లాడటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు.
ఇప్పటి వరకు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. సాదారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందన్నారు. స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సంయమనంతో ఉండాలన్నారు. అన్నప్రసాదంలో ఏదైన పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని ఛైర్మన్ వివరించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.