ADDITIONAL EO INSPECTIONS IN TIRUMALA _ తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు
తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు
తిరుమల, 2025 మే 01: శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రం, టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రం, డాలర్ల విక్రయ కేంద్రాలను గురువారం ఉదయం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.
ముందుగా అఖిలాండం వద్ద ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి కొబ్బరి కాయల సైజును పరిశీలించారు. కొబ్బరి కాయల విక్రయంపై భక్తుల అభిప్రాయాలను ఆరా తీశారు.
అనంతరం టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రానికి చేరుకున్న అదనపు ఈవో స్టాక్ ను పరిశీలించారు. అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించారు.
అదేవిధంగా టీటీడీ డాలర్ల విక్రయ కేంద్రానికి చేరుకుని డాలర్ల విక్రయం పరిశీలించారు. అమ్మకాలపై వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వీజీవో శ్రీ సురేంద్ర పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.