MASSIVE SUMMER CROWDS AT TIRUMALA _ తిరుమలలో అధికంగా భక్తుల రద్దీ ఉంది- భక్తులు ఓపికగా ఉండేలా రావాలి

* DEVOTEES URGED TO BE PATIENT BY TTD CHAIRMAN 

 

Tirumala, 29 May 2022: TTD Chairman Sri YV Subba Reddy on Sunday appealed to devotees to come prepared to patiently wait till their turn for Srivari Darshan in view of huge summer crowds.

 

Speaking to reporters in front of Srivari temple on Sunday the TTD Chairman said Tirumala was witnessing a heavy surge of pilgrims as the Covid norms were relaxed after two years.

 

Complimenting officials and employees for their hard work and service in managing all facilities for the heavy influx of devotees, the TTD chairman said drinking water and Annaprasadam were made available to all devotees on a war footing.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో అధికంగా భక్తుల రద్దీ ఉంది

– భక్తులు ఓపికగా ఉండేలా రావాలి

తిరుమల 29 మే 2022: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆదివారం తనను.కలసిన మీడియాతో చైర్మన్ మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు అనూహ్య సంఖ్యలో తిరుమల కు తరలి వస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమల కు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పని చేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చైర్మన్ అభినందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది