SRI RADHA MANOHAR DAS VIOLATED COVID GUIDELINES SAYS TTD _ తిరుమలలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ రాధమనోహర్ దాస్ – సిబ్బందిని నీచంగా మాట్లాడటం, భక్తులను రెచ్చగొట్టడం తీవ్రంగా పరిగణిస్తాం : టీటీడీ
Tirumala, 02 September 2021: TTD strongly condemned the anti-social acts of Sri Radha Manohar Das by whipping up devotee sentiments with false accusations against TTD staff after violating Covid guidelines on social distancing.
TTD condemned Sri Radha Manohar Das acts as a serious violation of Covid norms and an attempt for inciting devotees against other religions by spreading falsehood and baseless accusations with audio and videos on social media.
TTD appealed to devotees not to believe in the false allegations made by such vested elements and use abusive language on TTD staff in a holy shrine-like Tirumala.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ రాధమనోహర్ దాస్
– సిబ్బందిని నీచంగా మాట్లాడటం, భక్తులను రెచ్చగొట్టడం తీవ్రంగా పరిగణిస్తాం : టీటీడీ
తిరుమల 2 సెప్టెంబరు 2021: తిరుమలలో కోవిడ్ నిబంధనల ను ఉల్లంఘిస్తూ ఎక్కువ మంది భక్తులను ఒక చోట గుమికూడేలా చేసిన శ్రీ రాధమనోహర్ దాస్ అనే వ్యక్తి చర్యలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బందిని నీచంగా మాట్లాడటం, వారిని అన్య మతస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాము.
శ్రీ దాస్ అధికారులను కించపరిచేలా, మతాల.మధ్య చిచ్చు పెట్టి భక్తుల్లో అలజడి రేకెత్తించేలా వ్యవహరించారు. ఇంతటితో ఆగకుండా సదరు వీడియోను, అవాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో కూడా అనేక సార్లు ఈయన ఇలాగే వ్యవహరించారు. ఆయన తిరుమలకు తిరుమలకు వచ్చినప్పుడల్లా ఉద్యోగులను కించపరచడం , భక్తులను ఇబ్బంది పెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పవిత్ర పుణ్య.క్షజేత్రమైన తిరుమలలో ఆమోదయోగ్యం కాని భాష వాడుతున్న ఇలాంటి వారికి భక్తులు అడ్డు చెప్పాలని, ఇలాంటి వ్యక్తుల అవాస్తవ ఆరోపణలను భక్తులు విశ్వసించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది