CHAKRATHIRTHA MUKKOTI HELD _ తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
INCESSANT RAINS ENHANCES THE BEAUTY OF THE TORRENT
TIRUMALA, 12 DECEMBER 2024: The Chakra Thirtha Mukkoti, one of the important torrent annual festivals that is being observed in Tirumala every year in the month of Karthikai was held on Thursday.
This sacred Chakra Theertham, considered one among the Seven Muktiprada Theerthams is located, a few miles away in the southern direction of Srivari Temple in the deep green woods of Seshachala ranges.
The incessant rainfalls since Wednesday has brought the waterfalls to live in full spate giving a visual treat to the devotees.
After the second bell in Tirumala temple, a team of temple staff reached the top of the torrent and offered
Special Pujas including Abhishekam to Sri Sudarshana Chakrattalwar engraved on the rocky hill along with Sri Narasimha Swamy and Anjaneya Swamy idols located in this sacred place and later Prasadam was offered to the devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
తిరుమల, 2024 డిసెంబరు 12: తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మహావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.
వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా భాసిల్లుతోంది.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.