తిరుమలలో ఘనంగా ప్రారంభమైన అభిద్యేయక జ్యేష్ఠాభిషేకం
తిరుమలలో ఘనంగా ప్రారంభమైన అభిద్యేయక జ్యేష్ఠాభిషేకం
తిరుమల, 20 జూన్ 2013 : ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజులపాటు తిరుమల శ్రీవారికి జరిగే జ్యేష్ఠాభిషేకం, సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో గురువారంనాడు ఘనంగా ప్రారంభమైంది.
ఈ ఉత్సవ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జూన్ 20వ తారీఖున నిర్వహించే ఆర్జితసేవలైన తిరుప్పావడ మరియు వసంతోత్సవ సేవలను తి.తి.దే రద్దుచేసింది.
కాగా తరతరాలుగా అభిషేకాదులతో అత్యంత ప్రాచీనములైన శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం ఏర్పాటుచేసిన ఉత్సవమే ఇది.
మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు అభిషేకాలు పంచామృత స్నపన తిరమంజనాదులు నిర్వహించిన తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.
ఈ కార్యక్రమంలో తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి సుబ్రహ్మణ్యం, జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఇతర అధికారులు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.