ABHISHEKAM PERFORMED TO KALIYAMARDHANA KRISHNA _ తిరుమలలో వైభవంగా కాళీయ‌మ‌ర్ధ‌నుడికి అభిషేకం

Tirumala, 27 August 2024: On the occasion of Gokulashtami, under the auspices of the TTD Horticultural Department, a grand Abhishekam was held to Kaliyamardhana Krishna at Gogarbham Gardens in Tirumala on Tuesday.

On this occasion, a special abhishekam was rendered to Swami with milk, curd, honey, coconut water, turmeric and sandal paste.   

After that Annaprasadam was distributed followed by Utlotsavam wherein youth participated eith enthusiasm in breaking the mud pots tied atop log pole.

Devotees enjoyed the celebrations.

Deputy Director of Garden Department Sri Srinivasulu, other officers and garden staff participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో వైభవంగా కాళీయ‌మ‌ర్ధ‌నుడికి అభిషేకం

తిరుమల, 2024 ఆగస్టు 27: టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమల గోగర్భం సమీపంలోని కాళీయ‌మ‌ర్ధ‌నుడైన శ్రీ‌కృష్ణునికి అభిషేకం వైభవంగా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు తోచందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ, ఉట్లోత్స‌వం నిర్వ‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.