TTD TRUST BOARD MEETING HELD IN TIRUMALA _ తిరుమలలో టిటిడి బోర్డు సమావేశం
Tirumala, May 07 2025: TTD Chairman Sri B.R. Naidu has announced that the land adjacent to the seven hills should not be allotted to private individuals to protect the sanctity of the world-famous spiritual pilgrimage site of Tirumala.
The TTD Trust Board Mandal meeting was held at Annamaiah Bhavan in Tirumala on Wednesday.
Earlier, the TTD board had decided to transfer 24.68 acres of land belonging to the Andhra Pradesh Tourism Authority (APTA) to TTD in Survey No. 604 in Peruru village of Tirupati Rural Mandal. In lieu of that site, the TTD Board has approved the transfer of 24.68 acres of TTD land in Tirupati Urban Survey No. 588-A to APTA.
Similarly, the transfer of another 10.32 acres of APTA land in Survey No. 604 in Tirupati Rural to TTD, and in lieu of that, the TTD Board has requested the State Government to expedite the process of allotting 10.32 acres of TTD land in Survey No. 588-A in Tirupati Urban to APTA.
TTD EO Sri J. Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, Board members Smt. V. Prashanthi Reddy, Smt. Panabaka Lakshmi, Sri Jasti Purna Sambasiva Rao, Sri Nannapaneni Sadashiva Rao, Sri M. Shantaram, Smt. T. Janakidevi, Sri G. Bhanuprakash Reddy participated in this meeting, while Sri Jyothula Nehru, Sri M.S. Raju, Sri S Naresh Kumar, Smt. Suchitra Ella, Sri N. Narsi Reddy, Sri A. Munikoteswara Rao, Endowments Secretary Sri Vinay Chand, Commissioner Sri Ramachandra Mohan participated virtually.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో టిటిడి బోర్డు సమావేశం
తిరుమల, మే 07 2025: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
ఇది వరకే తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నెం.604లో ఆంధ్ర ప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కు చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలో టిటిడి బోర్డు నిర్ణయం తీసుకోవడమైనది. ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్భన్ సర్వే నెం.588-ఏ లో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏ బదలాయింపునకు టిటిడి బోర్డు ఆమోదం తెల్పడమైనది.
• అదేవిధంగా తిరుపతి రూరల్ లోని సర్వే నెం.604లోని ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించడం, దానికి బదులుగా తిరుపతి అర్బన్ లోని సర్వే నెంబర్ 588-ఏ లోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టిటిడి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది.
ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు శ్రీమతి వి.ప్రశాంతి రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జాస్తి పూర్ణ సాంబశివరావు, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ ఎం.శాంతారామ్, శ్రీమతి టి.జానకీదేవి, శ్రీ జీ.భానుప్రకాష్ రెడ్డి పాల్గొనగా, వర్చువల్ మీటింగ్ లో జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎం.ఎస్. రాజు, శ్రీ ఎస్ నరేష్ కుమార్, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ ఎన్.నర్సిరెడ్డి, శ్రీ ఎ.మునికోటేశ్వర రావు, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ ఎన్.నర్సిరెడ్డి, శ్రీ ఎ.మునికోటేశ్వర రావు, దేవాదాయ శాఖ సెక్రటరీ శ్రీ వినయ్ చంద్, కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.