DISPOSE DUMP YARD GARBAGE IN THREE MONTHS – TTD EO _ తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
Tirumala, 22 November 2024:TTD EO Sri J Shyamala Rao along with Additional EO Mr CH. Venkaiah Chaudhary conducted extensive inspection in several areas of Tirumala on Friday.
First, they inspected the dumping yard at Kakulmanu Dibba near Gogarbham Reservoir and directed officials to take steps to remove the garbage that had accumulated there for a decade within three months.
Speaking to the media later EO said that arrangements are being made to remove one lakh metric tonnes of garbage accumulated in Tirumala since 30 years. He said that steps will be taken to prevent the stench from the accumulated garbage and actions will be taken as per the solid waste management regulations. He said that they have discussed with Tirupati Municipality officials to move the garbage from the Tirumala dumping yard and the municipal officials have already visited the dumping yard.
He further said that all the garbage will be removed in three to four months and in the future, the system of scientifically dumping the garbage will be implemented. He said that there are thousands of tons of wet garbage and if the IOCL biogas plant lift the amount of wet garbage will be reduced. He said that about 20 thousand tons of compost has already been prepared from wet garbage.
After reaching Papaninashanam, EO inspected the toilets, changing rooms and the parking areas and made several suggestions to officials. Among others he also directed the forest officials to develop the parks, repainting the sign boards in Papavinasanam. He also checked the toll receipts issued at the Papavinasanam toll gate.
Later EOmalso inspected and instructed officials to arrange facilities at the Akashganga Tirtha so that the devotees do not face any problem. He ordered to remove of the encroachments of the shops on the Akashaganga stairway so as not to disturb the movement of devotees.
TTD CE sri Satyanarayana, EE Sudhakar, Transport GM Sri Sesha Reddy, Dy CF0 Sri Srinivas, Deputy EO Smt Asha Jyoti, VGOSri Surendra and other officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు
మూడు నెలల్లో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగింపు
టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
తిరుమల, 2024 నవంబరు 22: తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని, మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే డంపింగ్ యార్డును సందర్శించినట్లు తెలిపారు.
మూడు, నాలుగు నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామన్నారు. భవిష్యత్తులో వచ్చే చెత్తను శాస్త్రీయంగా డంపు చేసే విధానం అమలు చేస్తామన్నారు. తడి చెత్త కూడా వేల టన్నులు ఉందని, ఐఓసీఎల్ బయో గ్యాస్ ప్లాంటు అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20వేల టన్నుల కంపోస్టు తయారు చేశామన్నారు.
అనంతరం పాపవినాశనం చేరుకున్న ఈవో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొను గదులు, పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫారెస్టు అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పాపవినాశనంలోని సూచీ బోర్డులను రీ పెయింటింగ్ చేయాలని సూచించారు. పాపవినాశనం టోల్ గేట్ వద్ద జారీ చేసే టోల్ రశీదులను తనిఖీ చేశారు.
అనంతరం ఆకాశగంగ తీర్థాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆకాశగంగ మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో టీటీడీ సిఈ శ్రీ సత్యనారాయణ, ఈ ఈ సుధాకర్ ,ట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, Dy CF శ్రీనివాస్ ,డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.