2,000 HELMETS DISTRIBUTED TO TTD EMPLOYEES _ టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ

Tirumala, 26 June 2025: TTD Chairman Sri B.R. Naidu, along with Chief Vigilance and Security Officer Sri Muralikrishna, distributed helmets to TTD employees at the Chairman’s Camp Office in Tirumala on Thursday.

Speaking to the media on the occasion, the Chairman stated that the initiative is to ensure the safety of TTD employees. He mentioned that 500 helmets had already been distributed recently, and now 2,000 more helmets are being given, thanks to the donations by Sri Nimmakayala Satyanarayana from Amalapuram and Sri Nagendra Prasad from Hyderabad. 

He further added that another 7,500 helmets would be provided to employees in the coming days. He urged all staff members to wear the helmets without fail ensuring their personal safety.

CV&SO highlighted that wearing helmets can save lives during accidents. 

He also said that special drives are being regularly conducted at Alipiri and on the ghat roads to enforce helmet usage. 

He also appealed to all pilgrims visiting Tirumala to wear helmets for a safe journey.

Annaprasadam Deputy EO Sri Rajendra, Vigilance Officer Smt. Sada Lakshmi, Annaprasadam Special Officer Sri Shastri, and other officials participated in the program.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ

తిరుమల, 2025 జూన్ 26: టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తో కలిసి గురువారం హెల్మెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశామని, అమాలాపురానికి చెందిన శ్రీ నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్ కు చెందిన శ్రీ నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2 వేల హెల్మెట్లు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని ఆయన కోరారు.

టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు అందిస్తున్న హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. హెల్మెట్లు ధరించడంపై అలిపిరి, ఘాట్ రోడ్ల వద్ద ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం తిరుమలకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీమతి సదా లక్ష్మీ, అన్న ప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.