CHAIRMAN INSPECTS TIRUMALA _ తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

TIRUMALA, 25 MARCH 2022: In view of increased pilgrim influx in the past few days, TTD Chairman Sri YV Subba Reddy on Friday made surprise inspections to verify the amenities being provided to the pilgrims.

 

As part of this, he inspected Annaprasadam counter near Rambhagicha Bus Stand and verified the distribution of Annaprasadam, in PAC – 1 he interacted with the devotees over the facilities. The pilgrims expressed satisfaction over the arrangements.

 

He later instructed the officials concerned to ensure that the devotees get accommodation within less waiting time and also enhance hygienic measures in the pilgrim influx areas.

 

Health Officer Dr Sridevi, VGO Sri Bali Reddy were also present. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

తిరుమల 25 మార్చి 2022: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

రాంభగీచా బస్టాండ్ బస్టాండు సమీపంలోని అన్న ప్రసాద వితరణ కౌంటర్ ను పరిశీలించారు. భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా, పారిశుధ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

అనంతరం పి ఎ సి 1 కు వెళ్ళి అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడారు. గదులు సులువుగా దొరుకుతున్నాయా, దర్శనం ఎలా అయ్యింది, ఎంత సమయం పట్టింది అని తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడ పారిశుధ్యం మరింత మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, విజిఓ శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది