తిరుమలలో ”నాదనీరాజనం” సంగీత కార్యక్రమం
తిరుమలలో ”నాదనీరాజనం” సంగీత కార్యక్రమం
తిరుపతి, సెప్టెంబర్-08, 2009: తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించబడుతున్న ”నాదనీరాజనం” సంగీత కార్యక్రమం, సెప్టెంబర్ నెల కార్యక్రమములు దీనితో పొందుపరిచాము. సంగీత ప్రధానమైన భక్తి రంజితమైన కార్యక్రమం టాప్ కళాకారులతో నిర్వహించబడుతున్నది. ఈ ”నాదనీరాజనం” శ్రీ వేంకటేశ్వరా భక్తిఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజు తిలకించి భక్తి పారవశ్యంతో పులకించి ఆనందాను భూతిని పొందగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.