ENHANCED GREENERY FOR SESHACHALA RANGES _ తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం స్వదేశీ వృక్ష సంపద అభివృద్ధిటీటీడీ డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు
TIRUMALA, 17 OCTOBER 2023: The Deputy Conservator of Forests for TTD Sri Srinivasulu said that to preserve the vegetation and biodiversity of the Seshachala ranges, TTD has taken up a massive indigenous forest vegetation programme with forty species.
Addressing the media persons at the Media Centre on Tuesday, the DyCF said, that there are very rare plant and animal species in the 6 thousand hectares of forest area within the TTD. It contains red sandalwood, sandalwood and many rare species of medicinal plants. He said that 100 hectares of Srigandham forest and 10 acres of flower plants are being grown for the needs of the Srivari temple.
For the safety of the devotees coming for darshan of Srivaru, Operation Leopard is continuing and trap cameras have been set up for continuous monitoring of the movement of wildcats. He said that 70 forest personnel are serving the devotees on the Alipiri walking path and 30 on the Srivari Mettu path.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం స్వదేశీ వృక్ష సంపద అభివృద్ధి
– హరితశోభితంగా సప్తగిరులు
– టీటీడీ డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు
తిరుమల, 2023 అక్టోబరు 17: శేషాచల అడవులలో వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు భారీగా స్వదేశీ అటవీ వృక్ష సంపదను ఏర్పాటు చేసి, తిరుమలను హరితశోభితంగా తీర్చిదిద్దుతామని టీటీడీ డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగళవారం డిఎఫ్‌వో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎఫ్‌వో మాట్లాడుతూ, టీటీడీ పరిధిలోని 6 వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో అతి అరుదైన వృక్ష, జంతు జాతులు ఉన్నాట్లు చెప్పారు. ఇందులో ఎర్రచందనం, శ్రీగంధం, పలు ఔషధ మొక్కలు ఉన్నాయన్నారు. శ్రీవారి ఆలయ అవసరాలకు 100 హెక్టార్లలో శ్రీగంధం వనం, 10 ఎకరాల విస్తీర్ణంలో పూల మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో వివిధ రకాల ఆకర్షణీయమైన పూలమొక్కలు పెంచామని తెలియజేశారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తూ, ట్రాప్ కెమేరాలను ఏర్పాటు చేశామన్నారు. అలిపిరి నడక మార్గంలో 70 మంది, శ్రీవారి మెట్టు మార్గంలో 30 మంది అటవీ సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. అదేవిధంగా వేసవిలో అడవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా తగినంత మంది సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నామన్నారు. అడవుల్లోని వన్యమృగాలకు అవసరమైన తాగు నీటిని పైపుల ద్వారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శేషాచల అడవుల్లో అధికంగా ఉన్న అకేషియా(తుమ్మ) చెట్లను తొలగించి భూసారాన్ని పెంచి, ఈ చెట్ల స్థానంలో సంప్రదాయ మొక్కలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.