2922 CHILDREN’S ADMINISTERED PULSE POLIO DROPS _ తిరుమలలో పల్స్‌పోలియో ప్రారంభం
Tirumala, 31 January 2021: The TTD Chief Medical Officer Dr AB Narmada commenced administration of pulse polio drops to children in front of Tirumala temple on Sunday.
Dr Suharlatha, Dr Kusuma Kumari and other paramedical staff were also present.
After the completion of the polio drops administration program on Sunday evening by6pm, Dr Narmada said a total of 2922 children were administered Polio drops on the first day at Tirumala.
She said TTD has set up 25 polio camps from 7am to 6pm including one at Srivari temple, 20 at various locations and 4 exclusively for locals.
On Monday and Tuesday also the Pulse Polio Drops administration program will continue at Tirumala.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో పల్స్‌పోలియో ప్రారంభం
తిరుమల, 2021 జనవరి 31: దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎబి.నర్మద పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21 ప్రాంతాలలో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు ఏర్పాటు చేశారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని సిఎంవో కోరారు.
కాగా అశ్విని ఆసుపత్రి, జియన్‌సి, ఆర్‌టిసి బస్టాండ్, సిఆర్‌ఓ, పిఏసి 1 మరియు 2, ఎమ్‌బిసి-34, వైకుంఠం 1 మరియు 2, హెల్త్ ఆఫీసు, ఎటిసి, మేదరమిట్ట, వరాహస్వామి, రాంభగీఛ అతిధి గృహలవద్ద, శ్రీవారి ఆలయం లోపల, కల్యాణకట్ట, బాలాజీ నగర్, టిటిడి ఉద్యోగుల డిస్పెన్సరి ఎస్.వి. హైస్కూల్, పాపావినాశనం, అలిపిరి కాలినడక మార్గంలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంవో డా|| ఆర్వీఎస్.మురళీధర్, మెడికల్ సూపరింటెండెంట్ డా|| కుసుమకుమారి, ఇతర డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.