PULSE POLIO AWARENESS RALLY HELD IN TIRUMALA _ తిరుమ‌ల‌లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ

Tirumala, 20 December 2025: A Pulse Polio awareness rally was organised in Tirumala on Saturday, from S.V. High School to Balaji Nagar.

As part of the nationwide Pulse Polio programme, polio drops will be administered to children below five years of age on Sunday, December 21, from 7 am to 5 pm at various locations in Tirumala.

To create awareness about this initiative, the rally was conducted under the leadership of Dr. Subba Reddy, medical Superintendent incharge of Aswini Hospital.

The rally witnessed the participation of S.V. High School Headmaster Sri Kishan, along with hospital staff, teachers and students.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ

తిరుమల, 2025 డిసెంబర్ 20: తిరుమలలో శనివారం పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఎస్వీ హైస్కూల్ నుండి బాలాజీ నగర్ వ‌ర‌కు నిర్వహించారు.

ఐదేళ్లలోపు పిల్లలకు డిసెంబర్ 21వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఇంఛార్జ్ డాక్టర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో ఎస్వీ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ కిషన్, ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.