TTD BOARD RESOLUTIONS _ టీటీడీ ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలు
TIRUMALA, 18 NOVEMBER 2024: The TTD board in its maiden meeting under the Chairmanship of Sri B R Naidu has taken some important decisions on Monday.
After the completion of the board meeting at Annamaiah Bhavan in Tirumala, the TTD board Chief along with the EO Sri J Syamala Rao briefed the decisions to the media. Some excerpts:
Reducing the darshan time of Sri Venkateswara Swamy from 20-30hours to 2-3hrs using Artificial Intelligence and advanced technology by taking the Experts’ advice
Merging of SRIVANI Trust into TTD Account and verifying the possibilities to change its name while continuing the Scheme
The board has given a nod to dispense with the Tourism Corporations Darshan quota of various states after a thorough examination of the complaints regarding irregularities in the issue of SED tickets under this category
The piled-up debris in the Dumping Yard at Tirumala to be cleared within 3-4 months
Srinivasa Setu Fly Over to be renamed as Garuda Varadhi
Board to request the State Government to hand over the 20acre land given to Tourism at Alipiri to TTD near Devlok Project
Writing a letter to the State Government for taking an appropriate decision about the non-Hindus working in Tirumala
Providing Darshan to Tirupati locals on the first Tuesday of every month
No political statements in Tirumala and action will be taken legally if needed against such persons as well on those who propagate them
Keeping in view the safety of TTD deposits, a decision will be taken in the next board meeting to deposit them in the Nationalized banks by withdrawing the already deposited ones from Private banks
Using the enhanced quality of ghee in the preparation of Srivari Laddu
Introducing one more tasty recipe in the every day menu at Annaprasadam Complex in Tirumala for the devotees
As the Visakha Sarada Peetham has violated the rules of TTD, following the Experts Committees’ report the lease of the Mutt will be cancelled
The repairs of leakages in the age-old Potu-temple kitchen in the Srivari temple along with the modernization of Vengamamba Annaprasadam Complex will be taken up by the TVS company
The TTD board approved the 10% hike in Bahumanam of employees who rendered special services during the annual Brahmotsavam of Tirumala Srivari Temple held from October 4th to 13th this year.. Regular employees @15,400 and for Outsouricing employees @ 7,535.
Other board members, TTD manadrins were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలు
తిరుమల, 2024 నవంబరు 18: టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు.
• ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయం.
– టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.
• తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు లేదా నాలుగు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయం.
• తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయం.
• అలిపిరిలో టూరిజం కార్పోరేషన్ ద్వారా దేవలోక్ కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం.
• తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
• తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం.
• శ్రీవాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశం.
– ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తాం.
– నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం.
• వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం.
• తిరుమలలో గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శ్రీ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టిటిడి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం.
• బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10 శాతం పెంచాలని నిర్ణయం. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400/-, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535/- బ్రహ్మోత్సవ బహుమానం.
• శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్న ప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ. ఈ పనులు ఉచితంగా చేయనున్న టీవీఎస్ సంస్థ.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.