POURNAMI GARUDA SEVA HELD _ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Tirumala, 29 July 2026: Pournami Garuda Seva was held at Tirumala in a grand manner on Wednesday evening.

Devotees occupied the Mada Street galleries to witness Sri Malayappa Swamy on Garuda Vahanam that was held between 7pm and 9pm braving drizzles.

HH Sri Pedda jiyar Swamy, HH Sri Chinna Jiyar Swamy of Tirumala,TTD Board members Smt Panabaka Lakshmi, Sri Bhanu Prakash Reddy, Tirumala temple DyEO Sri Lokanatham were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2026 జూలై 29: తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.